సీఎంగా తొలి సంతకం దేనిపైనంటే..

సీఎంగా తొలి సంతకం దేనిపైనంటే..

కర్ణాటక ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన బీఎస్‌ యడ్యూరప్ప రూ.56 వేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేస్తూ  తొలి సంతకం చేశారు. ఆకుపచ్చ కండువా కప్పుకుని కార్యక్రమానికి విచ్చేసిన యడ్యూరప్ప.. దైవసాక్షిగా, రైతుసాక్షిగా ప్రమాణం చేస్తున్నట్టు పేర్కొన్నారు. తాము అధికారంలోకి వస్తే రైతులకు, నేతన్నలకు రూ.లక్ష దాకా రుణ మాఫీ చేస్తామని బీజేపీ, జేడీఎస్‌లు తమ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించాయి. ఇప్పుడు యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనందున.. రుణ మాఫీ ఫైలుపై సంతకం చేశారు. పూర్తిస్థాయిలో మంత్రిమండలి కొలువుదీరిన తర్వాత యడ్యూరప్ప మరిన్ని సంచలన నిర్ణయాలు తీసుకోవచ్చునని విశ్లేషకులు భావిస్తున్నారు.