కాళ్లు చేతులు పట్టుకోమన్నా.. అంతే..!!

కాళ్లు చేతులు పట్టుకోమన్నా.. అంతే..!!

బీజేపీకి ఓటు వేయని వాళ్ల కాళ్లు, చేతులు కట్టేసి తీసుకువచ్చి ఓటు వేయించాలంటూ కర్ణాటక బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్ప చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. దీనిపై కాంగ్రెస్ సహా ఇతర ప్రజాసంఘాలు యెడ్డీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి. అసలే గాలి జనార్థన్ రెడ్డిని రాష్ట్ర ప్రయోజనాల కోసం క్షమించానని చెప్పడం.. దీనిపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కౌంటరివ్వడంతో యడ్యూరప్పపై అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా మరోసారి పార్టీ పరువు మంటకలిసేలా వ్యాఖ్యానించడంతో హైకమాండ్‌ ఆయన్ను మందలించిందట. దీంతో దిద్దుబాటు యడ్యూరప్ప దిద్దుబాటు చర్యలకు దిగారు. తాను అనలేదని అంతా తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ ఇచ్చుకున్నారు. ఓటు వేయనివారి కాళ్లు, చేతులు పట్టుకుని అయినా వారిచేత ఓటు వేయించాలన్నదే దాని అర్ధమని అన్నారు. తనది ఓ రైతు కుటుంబమని.. గ్రామాల్లో ఇలాగే మాట్లాడకుంటామని వివరించారు.