వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు పార్టీ షోకాజ్ నోటీసులు

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు పార్టీ షోకాజ్ నోటీసులు

ఇటీవల పార్టీ ఎమ్మెల్యేలపై తీవ్ర విమర్శలు చేస్తున్న నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు వైసీసీ షోకాజ్ నోటీసులిచ్చింది. పార్టీపై చేస్తున్న వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కోరింది. పార్టీ అడిగితేనే తాను తిరిగి వైసీపీలో చేరానని, పార్టీ గుర్తు లేకపోయినా సొంతంగా ఎంపీగా గెలవగల సత్తా తనకుందని ఆయన వివాదాస్పదంగా వ్యాఖ్యానించారు. ఎంపీ వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర కలవరం కలిగించాయి. ఇటీవలి కాలంలో రఘురామకృష్ణంరాజుకు, పశ్చిమ గోదావరి జిల్లా ఎమ్మెల్యేలకు మధ్య తీవ్రస్థాయిలో నువ్వా నేనా అనేలా విభేదాలు చోటు చేసుకున్నాయి. తనకు ప్రాణహాని ఉందని లోక్‌సభ స్పీకర్, జిల్లా ఎస్పీలకు ఆయన లేఖలు కూడా రాశారు. ఈ క్రమంలోనే పార్టీపైనా ఆయన విమర్శలు చేశారు.

మొత్తం ఐదు అంశాలను నోటీస్ లో ప్రస్తావించారు.

1) ఇంగ్లీష్ మీడియం అంశంలో విభేదించడం,

2) ఇసుక విషయంలో ఎమ్మెల్యేల మీద కామెంట్స్ ,

3) బతిమలాడితేనే పార్టీలో చేరానన్న కామెంట్స్,

4) మూడు రాజధానుల నిర్ణయం మీద ధిక్కార స్వరం,

5 ) పందులే గుంపుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుందనే కామెంట్స్.