బ్రహ్మణికి లోకేష్ మెసేజ్ పెట్టాలంటే జగన్ కి చెబుతున్నారా ?

బ్రహ్మణికి లోకేష్ మెసేజ్ పెట్టాలంటే జగన్ కి చెబుతున్నారా ?

టీడీపీ అధికారాన్ని కోల్పోయాక తొలిసారిగా శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌. ముందుగా కోటబొమ్మాళి మండలంలోని అచ్చెన్నాయుడు స్వగ్రామమైన నిమ్మాడకు చేరుకున్నారు. ఎర్రన్నాయుడి విగ్రహానికి నివాళులర్పించారు. తర్వాత అచ్చెన్నాయుడి ఇంటికెళ్లి ఆయన కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. తప్పుడు కేసులతో ఎవరూ అధైర్యపడొద్దని పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు లోకేశ్‌. ఏడాది కాలంగా ఒంటిచేత్తో అధికార పార్టీని ఎదుర్కొంటున్న అచ్చెన్నాయుడ్ని తప్పుడు కేసులో ఇరికించారని ఫైరయ్యారు లోకేశ్‌.  ఏపీలో ఫేస్‌బుక్‌లో పోస్టు చేయాలన్నా పెళ్లానికి వాట్సాప్ చేయాల‌న్నా వైఎస్ జగన్ పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి నెల‌కొంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

టీడీపీ నాయకుల‌పై, కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని దేశమంతటా అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుంటే...ఏపీలో మాత్రం రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందని విమర్శించారు లోకేశ్. లోకేష్ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఎదురుదాడి చేశారు. బ్రహ్మణికి మెసేజ్‌లు పెడితే...సీఎం జగన్‌కు చెప్పే పెడుతున్నావా?అంటూ సెటైర్లు పేల్చారు. లోకేష్ వ్యాఖ్యలపై విజయసాయి ట్వీట్‌ చేశారు. సీఎం జగన్ పర్మిషన్‌ తీసుకుంటున్నావా?అంటూ ప్రశ్నించారు. చేతగాని మాటలతో ఎందుకు మీ ఆవిడను కూడా...ఈ గొడవలోకి లాగుతావంటూ లోకేశ్‌పై సెటైర్ వేశారు విజయసాయిరెడ్డి.