షియోమి రెడ్‌మి ఎస్2 ఫీచర్లు ఇవే

షియోమి రెడ్‌మి ఎస్2 ఫీచర్లు ఇవే

అందుబాటులో ధరలో అత్యాధునిక ఫీచర్లను వినియోగదారులకు అందజేస్తోన్న చైనాకు చెందిన దిగ్గజ మొబైల్ తయారీ సంస్థ షియోమి మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. రెడ్‌మి సిరీస్‌లో బెస్ట్ సెల్ఫీ కెమెరా స్మార్ట్‌ఫోన్‌గా చెబుతున్నారు. దీనిని ముందుగా చైనా మార్కెట్లోకి ప్రవేశపెట్టారు.. కొద్దిరోజుల తర్వాత ఇది భారత మార్కెట్లో అందుబాటులోకి రానుంది. మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం ఇది ఈ నెలలోనే ఇండియాకు రావచ్చు. దీనిలో 16 మెగా ఫిక్సల్ కెమెరాతో పాటు అర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫీచర్లు, ఫేస్ అన్ లాక్‌, డ్యూయెల్ సిమ్,  5.99 అంగుళాల హెచ్‌డీ 18:9 యాస్పెక్ట్ రేషియోతో స్క్రీన్‌, క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 625 ప్రాసెసర్, 3/4 జీబీ, 32/64 జీబీ స్టోరేజీ..ఆండ్రాయిడ్ ఓరియో 8.1, వెనుక భాగంలో 12.5 మెగా పిక్సల్‌తో డబుల్ కెమెరా‌, 3,080 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి...