దీపావళికి షియోమీ టెలివిజన్లు

దీపావళికి షియోమీ టెలివిజన్లు

చైనాకు చెందిన మొబైల్స్ కంపెనీ షియోమీ ఇప్పటికే స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో తనదైన ముద్రవేసి సత్తా చాటుతుంది. ఈ క్రమంలో షియోమీ కంపెనీ మరో అడుగు ముందుకేసి భారత్‌లో టెలివిజన్‌ సెట్లు తయారుచేయడానికి రంగం సిద్ధం చేసింది. తైవనీస్‌ కాంట్రాక్ట్‌ మానుఫ్రాక్ట్ర్చర్‌ ఫాక్స్‌కాన్‌తో భాగస్వామ్యం కూడా షియోమీ  కుదుర్చుకుంది. వచ్చే మూడు నెలల్లో... దీపావళి పండుగ సీజన్‌ సమయంలో ఆన్‌లైన్‌ అమ్మకాల్లో అగ్రస్థానంలో ఉండాలని షావోమి భావిస్తోందని ముగ్గురు సీనియర్‌ ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్‌లు చెప్పారు. దీపావళి పండుగ విక్రయాల్లో ఎక్కువగా మేడిన్‌ ఇండియా మోడల్సే ఉండనున్నాయని పేర్కొన్నారు. భారత్‌లోనే టీవీ సెట్లను రూపొందిస్తుండటంతో.. కంపెనీ పన్ను ప్రయోజనాలను కూడా పొందనుందని, అయితే టీవీల ధరలను మాత్రం తగ్గించే అవకాశం లేదని ఎగ్జిక్యూటివ్‌లు తెలిపారు. ప్రస్తుతం ఫాక్స్‌కాన్‌తో జరుపుతున్న చర్చలు తుది దశలో ఉన్నాయని సమాచారం. భారత్‌లో టెలివిజన్లను తయారుచేయడం షావోమి ప్రారంభిస్తుందని, ఈ ఏడాదిలో ఈ ప్రక్రియ ప్రారంభం కావొచ్చని షావోమి ఇండియా అధికార ప్రతినిధి తెలిపాడు.. కానీ ఫాక్స్‌కాన్‌ మాత్రం దీనిపై స్పందించలేదు. 

Photo: FileShot