ప్రపంచ పాముల దినోత్సవం : విషసర్పాల కోసం ప్రత్యేకమైన కేక్... 

ప్రపంచ పాముల దినోత్సవం : విషసర్పాల కోసం ప్రత్యేకమైన కేక్... 

ఐక్యరాజ్య సమితి జులై 16 వ తేదీని ప్రపంచ పాముల దినోత్సవంగా గుర్తించింది.      ప్రపంచ వ్యాప్తంగా ఈరోజును స్నేక్ క్యాచర్స్ అంగరంగ వైభవంగా సెలెబ్రేట్ చేస్తుంటారు.   భూమిపై ఎన్నో వందల జాతుల పాములు ఉన్నాయి.  అన్ని విషపూరితమైనవి కాదు.  కానీ, మనిషి భయంతో పాములను చంపేస్తున్నాడు.  అలాంటి వారికి అవగాహన కల్పించడమే ప్రపంచ పాముల దినోత్సవం ముఖ్య ఉద్దేశ్యం అని అంటున్నారు స్నేక్ క్యాచర్స్.  ఇక జంషెడ్ పూర్ లోని స్నేక్ క్యాచర్స్  వరల్డ్ స్నేక్ డే ని అంగరంగ వైభవంగా నిర్వహించారు.  ఓ పెద్ద కేక్ తీసుకొచ్చి కట్ చేసి, ఆ కేక్ లను పాములకు తినిపించారు.    పాములు తమ జీవితంలో ఒక భాగంగా మారిపోయాయని, వాటిని స్నేహితుల్లా భావిస్తామని, తాము ఐదు రకాల విషపూరితమైన సర్పాలకు ఆశ్రయం ఇస్తున్నట్టు జంషెడ్  పూర్ స్నేక్ క్యాచర్స్ పేర్కొన్నారు.