టిక్ టాక్ లో పరిచయమయ్యాడు... ఇంటికి పిలిచి రేప్ చేశాడు... చివర్లో చివర్లో ట్విస్ట్ ఇచ్చాడు...!!

టిక్ టాక్ లో పరిచయమయ్యాడు... ఇంటికి పిలిచి రేప్ చేశాడు... చివర్లో చివర్లో ట్విస్ట్ ఇచ్చాడు...!!

టిక్ టాక్ లో వీడియోలు చేసుకొని పాపులర్ కావడం వేరు... పరిచయాలు పెంచుకోవడం వేరు.  ఇలా టిక్ టాక్ లో పరిచయమైనా  ఓ వ్యక్తిని ఆ యువతి నమ్మింది.  పరిచయం ప్రేమగా మార్చుకున్నాడు.  నువ్వే సర్వస్వం అన్నాడు.  ఆమెకూడా తన సర్వస్వాన్ని సమర్పించింది.  ఆ తరువాతే జరిగిన మోసం తెలుసుకొని బాధపడింది. ఈ సంఘటన హైదరాబాద్ లోని పాతబస్తీలో జరిగింది.  

పాతబస్తీలో నివసించే ఓ యువతికి తలాబ్ కట్టలో నివసించే అక్బర్ షా అనే వ్యక్తితో టిక్ టాక్ ద్వారా పరిచయం ఏర్పడింది.  ఈ పరిచయం ప్రేమగా మారింది.  ఓ రోజు యువతిని తన సోదరి ఇంటికి పిలిచాడు.  అక్కడే దారుణంగా ఆమెపై రేప్ చేశాడు. అయితే, కొంతమంది పెద్దల సమక్షంలో నిఖా చేసుకుంటానని మాట ఇచ్చాడు.  ఆ తరువాత కూడా ఆమెపై లైంగికంగా దాడులకు పాల్పడ్డాడు.  ఆ తరువాత కనిపించకుండా పోయాడు.  ఏమయ్యాడో తెలియక ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.  పోలీసుల దర్యాప్తులో అనేక విషయాలు బయటకు వచ్చాయి.  సదరు వ్యక్తికి గతంలోనే పెళ్ళయిందని, నలుగురు పిల్లలు కూడా ఉన్నారని తెలిసింది.  అయితే, ప్రస్తుతం అక్బర్ షా పరారీలో ఉన్నాడు. పరారైన ఆ వ్యక్తి గురించి పోలీసులు వెతుకుతున్నారు.