దారుణం: భార్యపై భర్తతో సహా ముగ్గురు కలిసి...  

దారుణం: భార్యపై భర్తతో సహా ముగ్గురు కలిసి...  

అదనపు కట్నం కోసం ఓ భర్త కట్టుకున్న భార్యను కిడ్నాప్ చేయడమే కాకుండా, తన ముగ్గురు స్నేహితులతో కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. మత్తు మందు ఇచ్చి నాలుగు రోజులపాటు ఆమెను చిత్రహింసలకు గురి చేశారు ఆ భర్త.  నాలుగు రోజుల తరువాత భార్యను రైల్వే ట్రాక్ దగ్గర వదిలేసి వెళ్లిపోయారు.  షాక్ నుంచి బయటపడిన ఆ భార్య, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసింది.  దీంతో పోలీసులు భర్తను, అతని ముగ్గురు స్నేహితులను అదుపులోకి తీసుకున్నారు.  

ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ లోని ఫిలిబిత్ లో జరిగింది.  ప్రభుత్వ అంబులెన్స్ విభాగంలో పనిచేస్తున్న ఓ వ్యక్తికి 2016లో అదే ప్రాంతానికి చెందిన ఓ మహిళతో వివాహం జరిగింది.  పెళ్లి చేసుకున్న కొన్ని రోజుల తరువాత అదనపు కట్నం కోసం ఆమెను హింసించడం మొదలుపెట్టాడు.  గర్భవతి అని చూడకుండా కొట్టడంతో మహిళ గర్భం కోల్పోయింది.  2018 నుంచి భర్తకు దూరంగా ఉంటోంది.  ఈ క్రమంలో ఇటీవలే పోలీసులు ఇచ్చిన కౌన్సిలింగ్ తో ఇద్దరు కలిసి ఉంటున్నారు.  మరలా ఆ భర్త అదనపు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టాడు.  ఈ క్రమంలోనే ఆ భర్త భార్యను కిడ్నాప్ చేసి తన ముగ్గురు స్నేహితులతో కలిసి అత్యాచారం చేశాడు.  అత్యాచారం చేసిన నిందితులను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు.