మహిళ ట్రాప్..నగ్న దృశ్యాలతో బ్లాక్ మెయిల్..సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో !

మహిళ ట్రాప్..నగ్న దృశ్యాలతో బ్లాక్ మెయిల్..సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో !

భ‌ద్రాద్రి కొత్త గూడెం జిల్లా పాల్వంచ‌ క‌ర‌గ‌వాగులో దారుణం చోటుచేసుకున్నది. వివాహిత‌ మ‌హిళ‌ ను లోబ‌ర్చుకున్న ఇద్దరు యువ‌కులు ఆమెతో సన్నిహితంగా ఉన్నపుడు ఆమె న‌గ్న దృశ్యాలను ర‌హ‌స్యంగా చిత్రీక‌రించారు. అనంత‌రం బ్లాక్ మెయిల్ చేసి ఆమె నుండి డిమాండ్ చేశారు. అయితే ఆమె అతను ఎంత బెదిరించినా డబ్బు ఇచ్చేందుకు ఆమె ఒప్పుకోక పోవడంతో ఆ దృశ్యాలను సోష‌ల్ మీడియా లో పెట్టాడు. ఊరంతా తన అశ్లీల‌ చిత్రాలను చూశారని అవ‌మానానికి గురైన‌ మ‌హిళ‌ ఆత్మహ‌త్య చేసుకున్నది. ఏపీకి చెందిన‌ ఆమె కుటుంబం స్థానికంగా 15 ఏళ్ళుగా నివ‌సిస్తున్నారు.

వివాహిత‌ను లైంగికంగా లోబరుచుకున్న స్థానిక‌ యువ‌కుడు త‌ర‌చూ డ‌బ్బులు డిమాండ్ చేస్తున్నాడు. డ‌బ్బులు ఇవ్వక‌పోతే సోష‌ల్ మీడియా లో పెడ‌తామంటూ బెదిరించాడు. డ‌బ్బులు ఇచ్చేందుకు మ‌హిళ‌ నిరాక‌రించ‌టంతో ఊర్లో కుర్రకారున్న వాట్స్ యాప్ గ్రూప్ ల‌లో పోస్ట్ చేశాడు. విషయం తెలుసుకున్న ఆమె అవ‌మానంగా భావించి, పురుగుమందు సేవించింది. హుటాహుటిన ఇంట్లోని వారు కొత్తగూడెం ఆసుప‌త్రికి తరలించగా ఆమె అక్కడ చికిత్స పొందుతూ మ‌ృతి చెందింది. ఆమె సూసైడ్ చేసుకోడానికి కారణం అయిన వారిని క‌ఠినంగా శిక్షించి న్యాయం చేయాల‌ని మ‌ృతురాలి కుటుంభ‌ స‌భ్యులు డిమాండ్ చేస్తున్నారు. మ‌హిళ‌ల‌ పై జ‌రుగుతున్న వ‌రుస‌ ఘ‌ట‌న‌ల‌ పై పోలీసులు క‌ఠినంగా వ్యవ‌హ‌రించాల‌ని మ‌హిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.