ఆ సినిమా ప్రేరణ తో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య .. చివరకు

ఆ సినిమా ప్రేరణ తో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య .. చివరకు

ప్రియుడి మోజులో పడి ఓ మహిళ కట్టుకున్న భర్తనే కిరాతకంగా హత్య చేసింది. సినిమాలో చూపించిన విధంగా  హత్య కేసు నుంచి తప్పించుకోవడానికి ఇద్దరు కలిసి ప్లాన్ చేశారు కానీ చివరకు పోలీసులకు దొరికిపోయారు. ఈ ఘటన మైసూరు జిల్లా లో చోటు చేసుకుంది . మైసూరు జిల్లా కేఆర్ నగర పరిధిలోని సాలిగ్రామకు చెందిన ఆనంద్  అనే వ్యక్తితో శారదకు కొన్ని సంవత్సరాల క్రితం వివాహం అయ్యింది. అయితే అప్పటికే శారదకు బాబు అనే వ్యక్తితో సంబంధం ఉంది. పెళ్లి తర్వాత కూడా ఆ సంబంధాన్ని కొనసాగిస్తూ వస్తోంది. ఈక్రమంలో తమ ప్రేమకు భర్త ఆనంద్ అడ్డుగా ఉంటున్నాడని, అతడిని హతమార్చాలంటూ ప్రియుడు బాబును ఆమె కోరింది. ప్రియుడితో కలిసి అతడిని దారుణంగా హతమార్చింది. ఆ తర్వాత పోలీసులు విచారణ చేపట్టారు భార్య తీరు పై అనుమానం రావడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు విషయం బయటపడింది. ఓ సినిమాలో కూతురిని కాపాడుకునేందు హీరో చేసిన విధంగా శవాన్ని పూడ్చి . ప్రమాదం  జరిగిందని చిత్రీకరించారు. అంతా అనుకున్నట్టే జరుగుతుందని భావించినప్పటికీ పోలీసులు అసలు విషయాన్ని రాబట్టారు.శారద, బాబులను అదుపులోకి తీసుకుని విచారించడంతో హత్య చేసిన విషయాన్ని పోలీసులు ఎదుట ఒప్పుకున్నారు.