ఆఫీస‌ర్ అరాచ‌కం.. మాస్క్ లేద‌న్నందుకు మ‌హిళా ఉద్యోగిపై దాడి.!

ఆఫీస‌ర్ అరాచ‌కం.. మాస్క్ లేద‌న్నందుకు మ‌హిళా ఉద్యోగిపై దాడి.!

ఏపీలో దారుణం జరిగింది. నెల్లూరులోని ఏపీ టూరిజం కార్యాలయంలో మహిళా ఉద్యోగినిని డిప్యూటీ మేనేజర్ చితకబాదాడు. కాంట్రాక్టు ఉద్యోగిని ఉషారాణి ఆఫీస్ లో మాస్క్ ధరించాలని సూచించినందుకు డిప్యూటీ మేనేజర్ ఆమె దివ్యంగురాలు అనికూడా చూడకుండా  జుట్టుపట్టుకుని మరీ కొట్టాడు. ఈ ఘటన సీసీటీవీ పుటేజ్ లో రికార్డు అయ్యింది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో  డిప్యూటీ మేనేజర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డిప్యూటీ మేనేజర్ చేతిలో దెబ్బలు తిన్న ఉషారాణి ని మహిళ కమీషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పరామర్శించారు. ఈ ఘటనను మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఖండించారు. మాస్కు ధరించమని సూచించిన  దివ్యాంగురాలైన మహిళా ఉద్యోగిపై అధికారిననే అహంకారంతో క్రూరంగా దాడి చేయడం అమానుషమన్నారు. ఇలాంటి వ్యక్తిని సస్పెండ్ చేయడానికి పర్యాటక శాఖకు 4 రోజులు పట్టిందా అని ప్రశ్నించారు. వైఎస్ జగన్ గారూ.. మీరు తెచ్చిన దిశ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందే అంటూ కామెంట్ చేసారు.