క్వారంటైన్‌లోనూ ప్రియుడిని వ‌ద‌ల‌ని మ‌హిళా కానిస్టేబుల్‌.. ఇలా దొరికిపోయింది..!

క్వారంటైన్‌లోనూ ప్రియుడిని వ‌ద‌ల‌ని మ‌హిళా కానిస్టేబుల్‌.. ఇలా దొరికిపోయింది..!

క‌రోనా వైర‌స్‌ను కూడా త‌న‌కు అనుకూలంగా మార్చుకుని ఎంజాయ్ చేయాల‌నుకున్న ఓ మ‌హిళా పోలీస్ కానిస్టేబుల్ అడ్డంగా దొరికిపోయింది.. ప్రియుడినే భ‌ర్త‌గా అధికారుల‌కు ప‌రిచ‌యం చేసి.. అత‌డితో క‌లిసి క్వారంటైన్‌లో ఉన్న మ‌హిళా కానిస్టేబుల్ వ్య‌వ‌హారం.. ప్రియుడి.. భార్య ఎంట్రీ ఇవ్వ‌డంతో బ‌ట్ట‌బ‌య‌లైంది.. వివ‌రాల్లోకి వెళ్తే.. మ‌హారాష్ర్ట‌లోని నాగ్‌పూర్‌లో కొంత‌మంది పోలీసుల‌కు క‌రోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో.. మ‌రికొంత‌మంది పోలీసుల‌ను క్వారంటైన్‌కు త‌ర‌లించారు అధికారులు.. దాంట్లో పెళ్లికాని మ‌హిళా కానిస్టేబుల్ కూడా ఉంది.. ఆమె ప్రైమ‌రీ కాంటాక్ట్‌పై ఆరా తీస్తే.. అప్ప‌టికే మ‌రో మ‌హిళ‌తో వివాహం జ‌రిగిన త‌న‌ ప్రియుడినే భ‌ర్త‌గా పేర్కొంటూ అధికారుల‌కు వివ‌రాలు ఇచ్చింది. ఇక‌, ఇద్ద‌రినీ క‌లిపి పోలీస్ ట్రైనింగ్ సెంట‌ర్‌లోని క్వారంటైన్‌కు త‌ర‌లించారు.. ఇక వారికి అడ్డేలేకుండా పోయింది. అయితే.. స‌ద‌రు వ్య‌క్తి భార్య సీన్‌లోకి రావ‌డంతో సీన్ రివ‌ర్స్ అయ్యింది.

మూడు రోజులైనా భ‌ర్త ఇంటికి రాక‌పోవ‌డంతో.. వివాహితుడైన స‌ద‌రు వ్య‌క్తి భార్య ఆరా తీసింది.. ఆమెకు త‌న భ‌ర్త వేరే మ‌హిళ‌తో క‌లిసి క్వారంటైన్‌లో ఉన్న విష‌యం తెలిసింది. త‌న‌ను క‌లిసేందుకు పీటీసీకి వెళ్ల‌గా అక్క‌డి గార్డ్స్ ఆమెను అనుమ‌తించ‌లేదు. ఈ వ్య‌వ‌హారాన్ని మ‌రింత సీరియ‌స్‌గా తీసుకున్న ఆమె.. తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆపై సిటీ పోలీస్ క‌మిష‌న‌ర్‌ను క‌లిసి విష‌యం మొత్తం చెప్పేసింది.. ఊహించ‌ని ఘ‌ట‌న‌తో షాక్‌తిన్న సీపీ.. విచార‌ణకు ఆదేశించారు. దీంతో.. స‌ద‌రు వ్య‌క్తిని మ‌రొక క్వారంటైన్ కేంద్రానికి త‌ర‌లించారు. కాగా, మ‌హిళా కానిస్టేబుల్‌, పోస్ట‌ల్ డిపార్ట్‌మెంట్‌లో ప‌నిచేసే వివాహితుడైన ఆమె ప్రియుడు.. ప్ర‌భుత్వ ప్రాజెక్టు ప‌నిమీద గ‌తేడాది అక్టోబ‌ర్‌లో క‌లుసుకున్నారు.. అలా మొద‌లైన ప‌రిచ‌యం చాలా దూర‌మే న‌డిచింది. చివ‌ర‌కు భ‌ర్త‌గా ప‌రిచ‌యం చేసి.. అడ్డంగా దొరికిపోయింది.