పోలీసులు ఆపారని... చేయి కోరికేసింది... ఆ ఆతరువాత... 

పోలీసులు ఆపారని... చేయి కోరికేసింది... ఆ ఆతరువాత... 

లాక్ డౌన్ తరువాత దేశంలో పరిస్థితులు మారిపోతున్నాయి.  ప్రజలు బయటకు రావడం తగ్గించేశారు.  కొంతమంది మాత్రం ఇంట్లో కూర్చోలేక బయటకు వస్తున్నారు.  దేశంలోని అన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ చేయడంతో మెట్రోపాలిటన్ నగరాలు బోసిపోయాయి.  కొంతమంది దీనిని అదునుగా తీసుకొని బయటకు వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు.  

కోల్ కతా నగరంలో ఓ యువతి క్యాబ్ లో బయటకు వచ్చింది.  పోలీసులు క్యాబ్ ను ఆపి ఎందుకు వస్తున్నారు అని ప్రశ్నించినందుకు ఆ యువతి పోలీసులపై ఫైర్ అయ్యింది.  వాళ్ళతో గొడవ పెట్టుకుంది.  కోపంతో ఓ పోలీసు చెయ్యి కొరికింది.  ఆ రక్తాన్ని మరో పోలీస్ యూనిఫామ్ పై ఉమ్మేసింది.  కానీ, పోలీసులు చాలా సహనంగా వ్యవహరించి చేయి చేసుకోకుండా అరెస్ట్ చేశారు. కరోనాపై ప్రపంచం యుద్ధం చేస్తుంటే ఇలా బాధ్యత లేకుండా రోడ్లపై తిరుగుతూ పోలీసులపై గొడవపడే వాళ్లను ఏం చేయాలి.  ఆలోచించండి.