మాస్ దర్శకుడి చేతిలో గూగుల్ స్టార్ నటి జీవితం..!

మాస్ దర్శకుడి చేతిలో గూగుల్ స్టార్ నటి జీవితం..!

టాలీవుడ్ మాస్ దర్శకుడు ఎవరు అంటే ఖచ్చితంగా చెప్పే పేరు పూరి జగన్నాథ్.  పూరి సినిమా హిట్ అయ్యింది అంటే.. అది ఏ రేంజ్ లో ఉంటుందో అందరికి తెలిసిందే.  మాస్ హిట్ కొడితే.. టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం షేక్ అవుతుంది. పూరి జగన్నాథ్ తో సినిమాలు చేయాలని అందుకే చాలామంది కోరుకుంటారు.  ఇటీవలే రామ్ తో తీసిన ఇస్మార్ట్ శంకర్ ఏ రేంజ్ లో హిట్ కొట్టిందో చెప్పక్కర్లేదు.  

ఇస్మార్ట్ శంకర్ సినిమా హిట్ తరువాత దర్శకుడు పూరి యంగ్ హీరో విజయ్ దేవరకొండతో సినిమా చేసేందుకు సిద్ధం అయ్యారు.  డిసెంబర్ నుంచి సినిమా సెట్స్ మీదకు వెళ్ళబోతున్నది.  ఇందులో హీరోయిన్ గా గూగుల్ స్టార్ ప్రియా ప్రకాష్ నటిస్తోంది. ఈ సినిమాను కూడా పక్కా మాస్ సినిమాగా  పూరి రూపొందించబోతున్నట్టు సమాచారం. మాస్ దర్శకుడి చేతిలో పడింది కాబట్టి ప్రియా ప్రకాష్ లైఫ్ ఎలా మారబోతుందో చూడాలి. మొదటిసినిమా లవర్స్ డే దారుణంగా ఫెయిల్ అయ్యింది.  మరి సెకను సినిమా ఎలా ఉంటుందో చూడాలి.