చిరు క్యారెక్టర్లో రాజశేఖర్..!!

చిరు క్యారెక్టర్లో రాజశేఖర్..!!
తెలుగులో బయోపిక్ ల హవా కొనసాగుతోంది.  సెలబ్రిటీ జీవితంలో ఏవైనా వివాదాస్పదాలు చోటుచేసుకుని వారి జీవితం ఆసక్తికరంగా ఉంటె.. అలాంటి వ్యక్తుల జీవితాలను ఆధారంగా చేసుకొని బయోపిక్ సినిమాలను నిర్మించేందుకు టాలీవుడ్ సిద్దమవౌతున్నది.  సావిత్రి జీవిత కథ ఆధారంగా వచ్చిన మహానటి సినిమా హిట్ కావడంతో.. ఈ సినిమాను స్ఫూర్తిగా తీసుకొని కొన్ని సినిమాలు తెరపైకి వస్తున్నాయి.  ఇలా వస్తున్న వాటిల్లో ఉదయకిరణ్ బయోపిక్ కూడా ఒకటి.  
 
ఉదయకిరణ్ ను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసిన తేజనే ఉదయకిరణ్ బయోపిక్ తీయబోతున్నారు.  ఈ సినిమాకు సంబంధించిన కథను కూడా తేజ సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది.  ఉదయ్ కిరణ్ జీవితంలో కీలకమైన మలుపు చిరు కూతురితో నిశ్చితార్ధం.  ఎంగేజ్మెంట్ తరువాత వివాహం క్యాన్సిల్ కావడం.. తరువాత ఉదయ్ కిరణ్ సినిమాలు వరసగా ఫెయిల్ కావడంతో.. ఒత్తిడిని ఎదుర్కొన్నారు.  ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు.  ఇక ఈ బయోపిక్ సినిమాలో చిరంజీవికి సంబంధించిన ఎపిసోడ్ కూడా ఉంటుందని తేజ ప్రకటించాడు. చిరు పాత్రలో ఎవరు నటిస్తారు అనే దానికి తేజ క్లారిటీ ఇచ్చాడు.  చిరు క్యారెక్టర్ కోసం రాజశేఖర్ ను తీసుకునే ఆలోచనలో ఉన్నాడట తేజ.  మరి చిరు క్యారెక్టర్ లో నటించేందుకు రాజశేఖర్ ఒప్పుకుంటాడా..? చిరు తో పాటు మెగా కుటుంబంలో చాలా మందిని చూపించాల్సి ఉంటుంది.  మరి వారందరిని కూడా తేజ ఈ సినిమాలో చూపిస్తాడా లేదా అన్నది సస్పెన్స్.