ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల పెంపు?

ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల పెంపు?

అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌... ఫెడరల్‌ రిజర్వ్‌ ఇవాళ వడ్డీ రేట్లను పెంచుతుందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. వడ్డీ రేట్ల గురంచి మీర ఎక్కువగా పట్టించుకోవద్దని ఫెడరల్‌ రిజర్వ్‌ ఛైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ అంటున్నా... మార్కెట్‌ మాత్రం వడ్డీ రేట్ల పెంపును డిస్కౌంట్‌ చేస్తోంది. ఫెడరల్‌  ఓపెన్‌ మార్కెట్‌ కమిటీ (ఎఫ్‌ఓఎంసీ) రెండు రోజుల సమావేశం ఇవాళ్టితో ముగుస్తుంది. భేటీ తరవాత జరిగే మీడియా సమావేశలో ఛైర్మన్‌ వడ్డీ రేట్లపై ప్రకటన చేస్తారు. మార్చి సమావేశంలో వడ్డీ రేట్ల పెంపుపై సభ్యులు సమానంగా చీలిపోయారు. ఏ ఒక్కరు రేట్ల పెంపుకు మద్దతు పలికినా సీన్‌ మారిపోయే అవకాశమంది. అనలిస్టులు మాత్రం 2018లో ఫెడరల్‌ రిజర్వ్‌ ఎన్నిసార్లు వడ్డీ రేట్లు పెంచుతుందనే అంశంపై చర్చిస్తున్నారు. ఈ ఏడాది కనీసం రెండు లేదా మూడు సార్లు వడ్డీ రేట్లను పెంచొచ్చని మెజారిటీ అనలిస్టలు భావిస్తున్నారు. వృద్ధిరేటుతో పాటు ద్రవ్యోల్బణం పెరుగుతున్నందున వడ్డీ రేట్ల పెంపు సాధారణమని మార్కెట్‌ వర్గాలు అంటున్నాయి. వడ్డీ కంటే కూడా మున్ముందు ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండబోతోందనే అంశంపై ఛైర్మన్‌ పావెల్‌ చేసే వ్యాఖ్యలు కీలకమని స్టాక్‌ మార్కెట్‌ విశ్లేషకులు అంటున్నారు.