జగన్‌తో బంధం రాహుల్‌ తేలుస్తారు

జగన్‌తో బంధం రాహుల్‌ తేలుస్తారు

ఆంధ్రప్రదేశ్‌లోని పార్టీకి పునర్‌ వైభవం తెచ్చేందుకు అందుబాటులో ఉన్న అన్ని అంశాలను పరిశీలిస్తానని ఏపీ ఇంచార్జిగా నియమితులైన ఊమెన్‌ చాందీ అన్నారు. వైకాపా అధినేత జగన్‌తో కాంగ్రెస్‌ ఎలా వ్యవహరించాలన్న అంశంపై పార్టీ అధినేత రాహుల్‌తో మాట్లాడాక నిర్ణయిస్తానని ఓ వార్త పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. స్థానిక నేతలతో మాట్లాడాక ఏపీలో తాము అనుసరించబోయే వ్యూహం ఖరారు చేస్తామన్నారు ఆయన.  యూత్‌ కాంగ్రెస్‌ నేతలుగా ఉన్న సమయంలో నుంచి తనకు వైఎస్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నారు. వైఎస్‌ అకాల మరణంతో ఏపీలో కాంగ్రెస్‌ గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయని చెప్పారు. ఏపీలో కాంగ్రెస్‌కు పునర్‌ వైభవం తెచ్చేందుకు తాను శాయశక్తులా కృషి చేస్తానని చెప్పారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనస్సుల్లో కాంగ్రెస్‌కు ఇంకా కాస్త చోటు ఉందని భావిస్తున్నానని ఊమెన్‌ చాందీ అన్నారు. ఆ రాష్ట్రంలో పార్టీని పునరుద్ధరించేందకు అవకాశముందన్నారు ఆయన.