రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతి

రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దమ్మపేట మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. దమ్మపేట మండలం మొద్దులగూడెం గ్రామానికి చెందిన దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి ద్విచక్రవాహనంపై సత్తుపల్లికి వెళ్తుండగా.. అటువైపు ఎదురుగా వచ్చిన లారీ వీరిని ఢీకొంది. ఈ ప్రమాదంలో భార్యా, భర్తలు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. కాగా చిన్నారులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటన జరిగిన వెంటనే లారీ డ్రైవర్ పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా  స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కొరకు ఆసుపత్రికి తరలించారు.