తమన్నా అందుకే నో చెప్పిందా..?

తమన్నా అందుకే నో చెప్పిందా..?
కెరీర్ ముగింపు దశకు చేరుకుంది అనుకుంటున్న సమయంలో బాహుబలి సినిమాతో మరలా కెరీర్ గాడిలోకి తెచ్చుకుంది తమన్నా.  బాహుబలి సీరీస్ లో తమన్నా నటన పరంగా, సాహసాల పరంగా ఆకట్టుకుంది.  ఈ సినిమాకోసం తమన్నా బాగానే కష్టపడింది. ఈ సినిమా తరువాత తమన్నా.. నా నువ్వే చిత్రంలో హీరోయిన్ గా చేసింది.  అటు చిరు సైరా సినిమాలో మంచి క్యారెక్టర్ ను పోషిస్తోంది.  బాహుబలిలో పోషించిన పాత్ర తీరుగానే ఆమె పాత్ర ఉంటుందట.  
ఇప్పుడు తమన్నా గురించిన ఓ న్యూస్  సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నది.  మాస్ మహారాజ రవితేజతో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ రెండు సినిమాలు చేస్తున్నది.  ఇందులో ఒకటి శ్రీను వైట్ల దర్శకత్వంలో అమర్ అక్బర్ ఆంటోని కాగా, రెండోది సంతోష్ శివన్ దశకత్వంలో ఉండబోతున్నది.  సంతోష్ శివన్ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు.  ఇందులో ఒకరిని ఇప్పటికే సెలెక్ట్ చేయగా, రెండో హీరోయిన్ కోసం తమన్నాను సంప్రదించారట.  కానీ, తమన్నా ఆ క్యారెక్టర్ చేయడానికి కోటి రూపాయలకు పైగా డిమాండ్ చేసినట్టు సమాచారం.  దీంతో ఆమెను ఆ సినిమా నుంచి పక్కన పెట్టారని తెలుస్తోంది. 
మైత్రి మూవీ మేకర్స్ సంస్థ తమిళంలో హిట్ అయిన తేరీ అనే సినిమాను తెలుగులో రీమేక్ చేస్తోంది.  మొదట ఈ సినిమాను పవన్ కళ్యాణ్ తో చేయాలని అనుకున్నారు.  కానీ, పవన్ సినిమాల నుంచి పూర్తిగా రాజకీయాల్లోకి వెళ్లగా ఆ అవకాశం రవితేజకు వచ్చింది.  తేరీలో విజయ్ పోషించిన పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రను రవితేజ చేస్తున్నారు.  రవితేజకు జోడిగా కాజల్ అగర్వాల్ ఇప్పటికే ఎంపికైంది.  కాగా, రెండో హీరోయిన్ గా తమన్నా తమన్నాను అనుకున్నా భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో నిర్మాతలు వేరే హీరోయిన్ కోసం ట్రై చేస్తున్నారట.  ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలయ్యాయి.  త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది.