ప్రముఖుల వెనుక ఉండే కళ్ళద్దాల సెక్యూరిటీ గార్డుల రహస్యం ఇదే !

ప్రముఖుల వెనుక ఉండే కళ్ళద్దాల సెక్యూరిటీ గార్డుల రహస్యం ఇదే !

మన దేశంలో ప్రముఖుల వెనుక ఉండే సెక్యూరిటీ గార్డులని మీరు ఎప్పుడైనా గమనించారా, ఎప్పుడూ కళ్ళకు నల్ల కళ్ళద్దాలతోనే ఉంటారు. వారు అవి లేకుండా బయటకు రావడం అనేది అసలు జరగదు, అలా జరగడం చాలా అరుదు. పబ్లిక్ మీటింగ్లకు హాజరయ్యే ప్రతి వీఐపీ వెనుకా కళ్ళద్దాలతో వీరు ఉంటారు. అయితే అసలు వారు అలా కళ్ళద్దాలతోనే ఎందుకు ఉంటారు ? అనే సందేహం మీకు చాలా సార్లు వచ్చి ఉండచ్చు. అయితే స్టైల్ కోసం అనుకుంటున్న వారూ లేక పోలేదు. అయితే వాళ్ళు అలా నల్ల కళ్ళద్దాలు పెట్టుకోవడానికి ప్రత్యేక కారణాలు ఉన్నాయి. శాస్త్రీయంగా అవి ప్రూవ్ చేయబడినవి కూడా. మరి ఇంకెందుకు ఆలశ్యం ఆ కళ్ళద్దాలు ఎందుకు పెట్టుకుంటారో చూసేద్దామా  ?

సెక్యూరిటీ వారు తమ కళ్ళతో కనపడే ఏరియా మొత్తం కవర్ చేస్తుంటారు. అయితే తమ కళ్ళ కదలికలను ఎవరూ గమనించకుండా, కళ్ళద్దాలు ఉపయోగపడతాయి. దాడి చేస్తే సెక్యూరిటీ వారి కదలికలను కనిపెట్టలేమని దాడి చేయడానికి ఆలోచిస్తారు దుండగులు. అలాగే బహిరంగ సభలు , పర్యటనలలో దుమ్ము, ధూళి అనేది కామన్, అటువంటి పరిస్థితుల్లో కళ్ళద్దాలు కళ్ళను కాపాడుతాయి. ఎందుకంటే దుండగులు ఎప్పుడైనా దాడి ఇలా ఓపెన్ ఏరియా లోనే చేయడానికి ప్లాన్ చేస్తారు. అటువంటి సమయాల్లో వారి కళ్ళు దుమ్ము వల్ల మరే ఇతర కారణాల వల్లో మూసుకుంటే అసలుకే మోసం వస్తుంది కదా.

ఇక పేలుళ్లు లేదా ఫైరింగ్ గనుక జరిగితే కళ్ళద్దాలు పెట్టుకున్న వ్యక్తి చూపు, పెట్టుకోని వారి కంటే చురుకుగా ఉంటుంది. దాంతో కౌంటర్ ఎటాక్ వెనువెంటనే చేసే అవకాశం ఉంటుంది. అటువంటివి సంభవించినప్పుడు అప్రమత్తమయి ప్రమాదాన్ని అరికట్టడానికి ఉపయోగపడతాయి. అలాగే ఏదైనా ఎటాక్ జరిగితే వారి హావభావాలను దుండగులకి అర్ధమవకుండా ఉండడానికి ఉపయోగపడతాయి. ఒక వేల దాడి జరిగితే వీరు షాక్ కి గురి అయినట్టు ఎదుటి వ్యక్తులకి కనపడితే వారు మరింత రెచ్చిపోయే ప్రమాదం ఉంది. కళ్ళద్దాలు అలాంటి దానిని బ్లాక్ చేసి వారిని సమర్ధవంతంగా నిలబెట్టే ప్రయత్నం చేస్తాయి. అంతే కాక సూర్యుడికి ఎదురుగా ఉన్నా సరే ఇవి పెట్టుకుంటే పెద్దగా కళ్ళు మండవు, పద్దాకా సూర్యకిరణాల వల్ల కళ్ళు మూసే ఇబ్బందీ ఉండదు.