బయ్యర్లకు రోబో పరీక్ష..!!

బయ్యర్లకు రోబో పరీక్ష..!!

వాయిదా పడుతూ వచ్చిన కాలా  ఎలాగోలా విడుదలైంది.  వసూళ్ల పరంగా కాస్త వెనకబడ్డా.. నిదానంగా పుంజుకునే  అవకాశం ఉన్నట్టు ట్రేడ్ వర్గాల సమాచారం.  కాలా తరువాత అభిమానులు శంకర్ రోబో 2.0 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతేడాది రిలీజ్ కావాల్సిన సినిమా ఇప్పటివరకు అతిగతిలేదు.  షూటింగ్ పూర్తయ్యి సంవత్సరం అవుతుంది.  గ్రాఫిక్స్ వర్క్స్ మిగిలిపోయాయి.  శంకర్ కు గ్రాఫిక్స్ వర్క్స్ ఒక పట్టాన నచ్చడంలేదు.  రోబో 2.0 లో అత్యధిక భాగం గ్రాఫిక్ వర్క్స్ ఉంటుంది.  దీంతో సినిమా భాగా ఆలస్యం అవుతూ వస్తున్నది.  

ఇప్పటికే ఈ సినిమా కోసం లైకా ప్రొడక్షన్స్ సంస్థ రూ.450 కోట్లు ఖర్చు చేసింది.  ఇంకా ఇంకా ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉంది.  శంకర్, రజిని సినిమా అనగానే బయ్యర్లు ఫ్యాన్సీ రేట్ ఇచ్చి ఇప్పటికే సినిమాను తీసుకున్నారు.  కొంతమంది పోటీపడి మరి తీసుకున్నారు.  బయటినుంచి వడ్డీలు తీసుకొచ్చి కొన్న బయ్యర్లు పాపం రోజు లైకా ప్రొడక్షన్ హౌస్ కు కాల్ చేస్తున్నారట.  సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది.. సినిమా రిలీజ్ చేస్తారా చేయరా..? సినిమా రిలీజ్ ఆలస్యమైతే డబ్బు తిరిగి ఇచ్చెయ్యమని అడుగుతున్నారట.  గ్రాఫిక్ వర్క్స్ పూర్తయ్యే వరకు రిలీజ్ డేట్ లాక్ చేయొద్దని నిర్మాతలకు చెప్పాడు.  దీంతో లైకా ప్రొడక్షన్ సంస్థ బయ్యర్లకు ఏదోకటి సర్ది చెప్పి పంపుతున్నారట.  రోబో వలన పాపం కఠినమైన పరీక్షలు ఎదుర్కోవలసి వస్తోంది.