పాపం పవన్ కళ్యాణ్ డైరెక్టర్ కు ఎందుకిలా..?

పాపం పవన్ కళ్యాణ్ డైరెక్టర్ కు ఎందుకిలా..?

పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే అవకాశం వస్తే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అందరు అనుకుంటారు.  అనుకున్నట్టుగానే చాలామంది సక్సెస్ సాధించారు. కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమా దర్శకుడికి అలాంటి అవకాశమే గోపాల గోపాల ద్వారా వచ్చింది.  హిందీలో సూపర్ హిట్టైన ఓ మై గాడ్ చిత్రాన్ని తెలుగులో గోపాల గోపాల గా రీమేక్ చేశారు.  ఆ సినిమా మంచి విజయాన్ని సాధించింది. వెంకటేష్ - పవన్ కళ్యాణ్ మల్టీస్టారర్ గా నటించిన ఈ సినిమా విజయంతో దర్శకుడు డాలి పేరు ఇండస్ట్రీలో మారుమ్రోగిపోయింది.  అవకాశాలు వస్తాయని అనుకున్నారు.  

గోపాల గోపాల తరువాత ఈ దర్శకుడు పవన్ కళ్యాణ్ తోనే తమిళంలో సూపర్ హిట్టైన అజిత్ సినిమా వీరం సినిమాను తెలుగులో కాటమరాయుడిగా రీమేక్ చేశారు. తమిళంలో విజయం సాధిస్తే తెలుగులో యావరేజ్ గా నిలిచింది.  కాటమరాయుడు తరువాత పాపం ఈ దర్శకుడికి పెద్ద ఆఫర్లు రాలేదు.  కాటంరాయుడు వచ్చి సంవత్సరం దాటిపోయింది.  ఇప్పటి వరకు డాలి మరో సినిమా చేయలేదు.  ప్రస్తుతం కథలు రెడీ చేసుకుంటున్నాడని, మంచి స్క్రిప్ట్ రెడీ కాగానే టాప్ హీరోతోనే సినిమా చేస్తానని అంటున్నాడు.  ఇక నితిన్ తో సినిమా చేస్తున్నట్టు వస్తున్న వార్తలను డాలి ఖండించాడు.  కేవలం ఆ పుకార్లే అని కొట్టిపారేశాడు.