లాక్ డౌన్ తో కరోనా ఆగుతుందా ? WHO ఏం చెబుతోంది ?

లాక్ డౌన్ తో కరోనా ఆగుతుందా ? WHO ఏం చెబుతోంది ?

కేవలం లాక్ డౌన్ తోనే కరోనా అదుపులోకి రాదని హెచ్చరిస్తోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. లాక్ డౌన్ కంటే.. కరోనా అనుమానితుల్న గుర్తించడం, వారి కాంటాక్టులను గుర్తించడమే అసలైన ప్రక్రియని స్పష్టం చేసింది. విస్తృత సంఖ్యలో కరోనా పరీక్షలు నిర్వహించాలని కూడా సూచిస్తోంది. కరోనా మహమ్మారిని తుదముట్టించే క్రమంలో ప్రధాని మోడీ దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించాయి. ప్రపంచంలో చాలా దేశాలు లాక్ డౌన్ నిర్ణయం తీసుకున్నాయి. అయితే లాక్ డౌన్ ప్రకటించినంత మాత్రాన కరోనాను ఓడించలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. 

కరోనాపై పోరాటంలో విజయం సాధించాలంటే మొదట వైరస్ సోకిన వారిని, అనారోగ్యంపాలైన వారిని గుర్తించాలని సూచించారు. ఆపై వారందరినీ ఐసోలేషన్ కు తరలించి, వారు కలిసిన వారిని కూడా ఐసోలేషన్ లో ఉంచాలని వివరించారు. అంతేతప్ప, వైరస్ సోకిన వారిని గుర్తించకుండా లాక్ డౌన్ ప్రకటిస్తే ఫలితం ఉండదని స్పష్టం చేశారు. లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుందని అన్నారు. కరోనా పరీక్షలు కూడా విస్తృత స్థాయిలో చేయాల్సిన అవసరం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ప్రతి దేశం వీలైనంత ఎక్కువ మంది పౌరులకు కరోనా పరీక్షలు చేస్తేనే.. అసలు తీవ్రత ఎంత ఉందో తెలుస్తుందని, అంతే కానీ కేవలం అనుమానితులకే పరిమితమైతే.. కరోనా తీవ్రత ఊహకు అందదని కూడా హెచ్చరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా చూసినా.. విస్తృతంగా కరోనా పరీక్షలు చేసిన దేశాల్లో వ్యాధి త్వరగా అదుపులోకి వచ్చింది. మిగతా దేశాలు కూడా వీటిని ఆదర్శంగా తీసుకోవాలని సూచిస్తోంది.