ఇక వాట్సాప్‌ ద్వారా చెల్లింపు

ఇక వాట్సాప్‌ ద్వారా చెల్లింపు

మనదేశంలో కనీసం 20 కోట్ల మందికి వాట్సాప్‌ ద్వారా పేమెంట్స్‌ చేయాలని ఫేస్‌బుక్‌ నిర్ణయించింది. ఈ మేరకు దేశంలోని ప్రధాన బ్యాంకులతో జరిపిన చర్చలు కొలిక్కి వచ్చాయి. వచ్చేవారం నుంచి  వాట్సాప్‌ పే పేరుతో పేమెంట్స్‌ సర్వీస్‌ ప్రారంభించవచ్చని తెలుస్తోంది. ఫేస్‌బుక్‌ ఇన్‌కార్పొరేటెడ్‌ కంపెనీకి చెందినది వాట్సాప్‌. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌తో నిధుల ట్రాన్స్‌ఫర్‌ సేవలు అందించేందుకు ఒప్పందాలు చేసుకుంది. త్వరలోనే స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కూడా ఈ జాబితాలో చేరనుంది. ఎస్‌బీఐ పూర్తి స్థాయిలో సిద్ధం కానందున... మిగిలిన మూడు బ్యాంకులతోనే పేమెంట్‌ సేవలు ప్రారంభించాలని నిర్ణయించింది. ఫిబ్రవరి నెలలో పది లక్షల మంది వినియోగదారులకు ప్రయోగాత్మకంగా పేమెంట్‌ సేవలు అందించింది వాట్సాప్‌ పే. ఇప్పటికే గూగుల్‌కు చెందిన తేజ్‌, అలీబాబా ఆర్థిక అండదండలు ఉన్న పేటీఎంలు పేమెంట్‌ సేవలు అందిస్తున్నాయి.