వాట్సాప్ లో ఐదు సరికొత్త ఫీచర్లు...!

వాట్సాప్ లో  ఐదు సరికొత్త ఫీచర్లు...!

వాట్సాప్ లో త్వరలో మరో ఐదు కొత్త ఫీచర్లు రానున్నాయి. ఈ మేరకు కంపెనీ బుధవారం ఒక  ప్రకటన విడుదల చేసింది. వెబ్​ వాట్సాప్​కు డార్క్ మోడ్​, క్వాలిటీ వీడియో కాల్స్​, కైఓఎస్​కు మాయమైపోయే స్టేటస్​, యానిమేటెడ్​ స్టిక్కర్స్, క్యూఆర్​ కోడ్స్ లను త్వరలోనే అందుబాటులోకి తెస్తామని సంస్థ ప్రకటించింది.

వెబ్​ వాట్సాప్​కు డార్క్ మోడ్​: ఇదివరకు ఆండ్రాయిడ్, ఐఓఎస్ లకు మాత్రమే డార్క్ మోడ్ అందుబాటులో ఉండగా ఇప్పుడు వెబ్ వర్షన్ కు కూడా అందుబాటులోకి రానుంది. 

 క్వాలిటీ వీడియో కాల్స్: వీడియో కాల్స్ మాట్లాడుతున్నప్పుడు స్క్రీన్ పై నొక్కితే ఆ భాగంలో క్లారిటీ ఎక్కువ వచ్చేలా రూపొందిస్తున్నారు. 
 

యానిమేటెడ్​ స్టిక్కర్స్ : వాట్సాప్ లో మరింత ఫన్ కోసం ఫన్నీ యానిమేటెడ్‌ స్టిక్కర్లు రానున్నాయి. 

 కైఓఎస్​కు మాయమైపోయే స్టేటస్: స్టేటస్ దానంతట అదే మాయమైపోయే ఫీచర్ ఇప్పటికే ఆండ్రాయిడ్, ఐఓఎస్​లలో ఉండగా.. ఇకపై కైఓఎస్​కు కూడా అందుబాటులోకి రానుంది. 

క్యూఆర్​ కోడ్స్ :క్యూ ఆర్ కోడ్ ద్వారా వ్యక్తి కాంటాక్ట్ ను స్కాన్ చేసి, సేవ్ చేసుకునే సదుపాయం రానుంది.