దళిత నేతను కలిస్తే తప్పేంటి: విజయసాయి

దళిత నేతను కలిస్తే తప్పేంటి: విజయసాయి

ఏసీ సీఎంపై వైసీపీ నేత విజయసాయిరెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులును తాను కలవకుండానే లేనిపోని ప్రచారాలు చేయిస్తున్నారని ఆరోపించారు. ఇవాళ తిరుపతిలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ఓ దౌర్భగ్యాపు సీఎం అని అన్నారు. మోత్కుపల్లిని కలవాలని అనుకోలేదని, కానీ చంద్రబాబు ఆరోపణలతో తప్పకుండా కలుస్తానని చెప్పారు. అసలు దళిత నేతను కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. గోబెల్స్‌ ప్రచారంలో చంద్రబాబును మించినవారు లేరని విజయసాయిరెడ్డి అన్నారు. పోలవరం నిర్మాణంలో ఒక్క రోజులో 13 వేల క్యూబిక్‌ మీటర్ల పనులు చేశామని అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. ఇదే విషయాన్ని తిరుపతి వెంకన్న మీద ప్రమాణం చేసి చెప్పగలరా అని ప్రశ్నించారు.