బెంగాల్ పంచాయితీని మమతా స్వీప్..  

బెంగాల్ పంచాయితీని మమతా స్వీప్..  

పశ్చిమబెంగాల్‌ పంచాయతీని మమతా స్వీప్ చేశారు. ఆ రాష్ట్ర పంచాయితీ ఎన్నికల్లో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ భారీ విజయం సాధించింది. గతంలో తొలి స్థానంలో ఉన్న సీపీఎం ఈసారి మూడో స్థానానికి పడిపోయింది. ఇప్పటి వరకు వెల్లడౌతున్న ఫలితాల ప్రకారం.. 19,394 గ్రామ పంచాయతీలను టీఎంసీ, 5,050 పంచాయతీలను బీజేపీ గెలుచుకోగా, 1,306 చోట్ల  సీపీఎం, 918 చోట్ల కాంగ్రెస్‌ గెలుపొందినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ వెల్లడించింది. అంతేకాకుండా పంచాయతీ సమితుల ఫలితాల్లోనూ అధికార పార్టీ మంచి ఫలితాలను నమోదు చేసుకుంది. టీఎంసీ 560 పంచాయతీ సమితులను గెలుచుకుని, 350 సమితుల్లో ఆధిక్యంలో ఉండగా బీజేపీ 24 స్థానాలను గెలుచుకుని మరో 16 చోట్ల మెజారిటీ దిశగా దూసుకుపోతుంది. జిల్లా పరిషత్‌లలో టీఎంసీ 55 స్థానాలను గెలుచుకొని 30 చోట్ల పూర్తి ఆధిక్యంలో ఉంది.