చుక్కేసి పోలీసులకే మందుబాబులు చుక్కలు 

చుక్కేసి పోలీసులకే మందుబాబులు చుక్కలు 

పోలీసులు ఎన్ని నిబంధనలు పెట్టినా... మందుబాబులు మారడం లేదు. వీకెండ్ వచ్చిందంటే చాలు చుక్క పడాల్సిందే. తప్ప తాగి ఊగాల్సిందే. అంతటితో ఆగకుండా రోడ్లమీదకు వచ్చి నానా హంగామా చేసి పోలీసులకే చుక్కలు చూపిస్తున్నారు.  హైదరారాబాద్ జూబ్లీహిల్స్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మందుబాబుల వీరంగం అంతా ఇంతా కాదు. 

పోలీసులు ఎంత కఠిన శిక్షలు విధిస్తున్నా... ఎంతలా అవగాహన కల్పిస్తున్నా.. మందుబాబులు మాత్రం అస్సలు తగ్గడం లేదు. గత రాత్రి హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ల పరిధిలో డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించగా, 60 మంది పట్టుబడ్డారు. 31 బైక్ లు, 29 కార్లను పోలీసులు సీజ్ చేశారు. వీరందరికీ సోమవారం నాడు కౌన్సెలింగ్ నిర్వహిస్తామని.. ఆ తర్వాత కోర్టుకు హాజరు పరుస్తామని పోలీసు అధికారులు వివరించారు. పట్టుబడిన వారిలో రెండు, మూడోసారి పట్టుబడిన వారు కూడా ఉన్నారని తెలిపారు. వీరిలో ముగ్గురు అమ్మాయిలు కూడా ఉన్నట్లు సమాచారం అందుతుంది