'బీసీలు తలెత్తుకునేలా చేశాం'

'బీసీలు తలెత్తుకునేలా చేశాం'

బీసీలకు వైసీపీ గతంలో చేసిందేమీ లేదని, భవిష్యత్తులో చేసేదేదీ ఉండదని ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ఇవాళ అమరావతిలో ఆయన మాట్లాడుతూ బీసీలతో వైసీపీ ఆత్మీయ సమావేశం నిర్వహించడం విడ్డూరంగా ఉందన్నారు. వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీల సంక్షేమానికి నిధులివ్వలేదని, బీసీ ఫెడరేషన్లను నిర్వీర్యం చేశారని విమర్శించారు. గత నాలుగేళ్ల పాలనలో బీసీలకు టీడీపీ ప్రభుత్వం దాదాపు రూ.36 వేల కోట్లు ఖర్చు చేసిందని అన్నారు. బీసీలు తలెత్తుకునేలా తిరుగుతున్నారంటే అది రాష్ట్ర ప్రభుత్వం విధానాల వల్లేనని యనమల అన్నారు. బీసీలను టీడీపీకి దూరం చేయాలన్న వైసీపీ కుట్రలు ఫలించవన్నారు. ఇక.. బీజేపీ చేస్తున్న విమర్శలపై యనమల స్పందిస్తూ..టీడీపీతో పొత్తు ఉన్నప్పుడే ఏపీలో ఆ పార్టీకి 2 ఎంపీ సీట్లు, 4 అసెంబ్లీ సీట్లు వచ్చాయని గుర్తుచేశారు.