సచిన్ కంటే అతనే మంచి ఆటగాడు : వసీం జాఫర్

సచిన్ కంటే అతనే మంచి ఆటగాడు : వసీం జాఫర్

భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ ప్రస్తుత భారత కెప్టెన్ విరాట్ కోహ్లీని భారతదేశంలోని ఉత్తమ వైట్ బాల్ క్రికెటర్‌గా ఎన్నుకున్నాడు, మా మధ్య పోలికలు కలిపి మాట్లాడకండి అని  విరాట్ కోహ్లీ మరియు సచిన్ టెండూల్కర్ చెప్పడంతో ప్రజలు ఆపేసారు. అయితే సచిన్, విరాట్ పోలిక పై వసీం జాఫర్ మాట్లాడుతూ... వన్డే క్రికెట్ లో చూసుకుంటే సచిన్ కంటే విరాట్ అద్భుతమైన ఆటగాడు. ఎందుకో మనకు తన పరుగులు చూస్తేనే తెలుస్తుంది అని అన్నాడు. విరాట్ కోహ్లీ తన 248 మ్యాచ్ ల వన్డే కెరీర్‌లో దాదాపు 60 సగటుతో 11,000 పరుగులు సాధించాడు. ఈ ప్రక్రియలో 43 సెంచరీలు కూడా కొట్టాడు. మరోవైపు, సచిన్ టెండూల్కర్ 18,426 పరుగులతో వన్డే క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. సచిన్ మొత్తం 463 వన్డేలలో 44.83. సగటుతో 49 సెంచరీలు సాధించాడు. అయితే అంతర్జాతీయ క్రికెట్ లో భారత ఆటగాళ్లు చాల మందే 10,000 పరుగులు సాధించారు. కానీ రంజీ ట్రోఫీలో ఆ ఘనత  సాధించిన ఏకైక ఆటగాడు వసీం జాఫర్. 2000 లో టెస్ట్ అరంగేట్రం చేసిన జాఫర్ 2008 లో తన టెస్ట్ కెరీర్లో చివరి మ్యాచ్ ఆడాడు