ఈ లక్షణాలు మీలో కనిపిస్తున్నాయా... చాలా జాగ్రత్తగా ఉండండి... 

ఈ లక్షణాలు మీలో కనిపిస్తున్నాయా... చాలా జాగ్రత్తగా ఉండండి... 

చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఇటీవల కాలంలో  మనిషిని బాధపెడుతున్న వ్యాధి గుండె జబ్బు.  మనిషి శరీరంలో అతి ముఖ్యమైన భాగం హార్ట్.  హార్ట్ ఎంత ఆరోగ్యంగా ఉంటె మనిషి అంతకాలం జీవనం సాగిస్తాడు.  హార్ట్ ఎటాక్ ఎవరికి ఎలా వస్తుందో తెలియదు.   అయితే, హార్ట్ ఎటాక్ వచ్చే ముందు కొన్ని శరీరం కొన్ని సూచనలు ఇస్తుంది. అలర్ట్ గా ఉండమని హెచ్చరిస్తుంది.  అవేంటో ఇప్పుడు చూద్దాం.  

శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటాం.  ఇలా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురైతే తప్పకుండా వైద్యులను సంప్రదించాలి.  మాట్లాడే సమయంలో తెలియని తత్తరబాటు వస్తుంది.  చెప్పాలనుకున్న విషయం చెప్పలేకపోవడం, ఒకే మాటను పలుమార్లు చెప్పడం వంటిది కూడా హార్ట్ ఎటాక్ రాబోతుంది అనే చెప్పేందుకు ఒక సూచన.  అలానే గుండెకు రక్త సరఫరా తగ్గిపోయినప్పుడు గుండెల్లో మంట వచ్చినట్టు ఉంటుంది.  ఇది కూడా గుండె నొప్పికి ఒక సంకేతం.  అదే విధంగా జలుబు దగ్గు, జ్వరంతో నిరంతరం బాధపడుతుంటే హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మత్తుగా ఉండటం, అలసటగా ఉండటం, ఒళ్ళు నొప్పులు, వికారం, తిన్నది జీర్ణం కాకపోవడం వంటివి కూడా హార్ట్ ఎటాక్ కు సంకేతాలు కావొచ్చు.  కాబట్టి నిర్లక్ష్యం చెయ్యొద్దని వైద్యులు సూచిస్తున్నారు.