మంత్రి VS ఎంపీ : నల్గొండలో ఒకరిపైకి ఒకరు దూసుకెళ్ళిన నేతలు...!

మంత్రి VS ఎంపీ :  నల్గొండలో ఒకరిపైకి ఒకరు దూసుకెళ్ళిన నేతలు...!

 

న‌ల్గొండ జిల్లాలో అధికారిక ప‌ర్య‌ట‌న రాజ‌కీయ విమ‌ర్శ‌ల‌కు, ప్ర‌తి విమ‌ర్శ‌ల‌కు వేదికైంది. మంత్రి జగదీష్‌రెడ్డి,ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.  నియంత్రిత సాగు సదస్సులో జగదీష్‌రెడ్డి ప్రసంగానికి  ఉత్తమ్‌ అడ్డుతగిలారు. రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం మాది అని మంత్రి మాట్లాతుండగా.. ఎక్కడ చేశారంటూ ఉత్తమ్ ప్రశ్నించారు. ప్రసంగానికి అడ్డుపడడం మంచి పద్దతి కాదని జగదీష్‌రెడ్డి అన్నారు. జగదీష్‌రెడ్డి తీరుపై ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.ఆ తర్వాత ఇద్దరు నేతలు ఒకరిపైకి ఒకరు వెళ్తూ ఘర్షణకి దిగారు. నువ్వేంత అంటే నువ్వేంత అనే స్థాయిలో వాగ్వాదం జరగ్గా నేతలు సర్ధి చెప్పారు.