పతంజలి, అదానీ మధ్య వార్‌

పతంజలి, అదానీ మధ్య వార్‌

రుచి సోయా కంపెనీ టేకోవర్‌ విషయంలో రామ్‌దేవ్‌ బాబా.. అదానీ చేతిలో ఓడిపోయారు. రుణ ఊబిలో కూరుకుపోయిన రుచి సోయా టేకోవర్‌ కోసం బిడ్‌లను ఆహ్వానించారు. ఆ బిడ్లను మంగళవారం తెరవగా.. రుచి సోయా కోసం రూ. 6000 కోట్లు చెల్లించేందుకు అదానీ విల్‌మార్‌ కంపెనీ సిద్ధమైంది. రామ్‌దేవ్‌ బాబా కంపెనీ పతంజలీ మాత్రం రూ. 5700 కోట్లకు బిడ్‌ వేశారు. సింగపూర్‌కు చెందిన విల్‌మార్‌ కంపెనీతో కలిసి అదానీ గ్రూప్‌ బిడ్‌ వేసింది. బిడ్లను చూసిన రుణదాతలు..తమ బిడ్లను సవరించుకునేందుకు మరోసారి అదానీ విల్‌మార్‌, పతంజలీకి మరో అవకాశమిచ్చారు. ఇంతకుమునుపు ఆరంభ రౌండ్‌లో ఇదే కంపెనీ కోసం రూ. 4500 కోట్లకే పతంజలి బిడ్‌ వేసింది. తరవాత పోటీ పెరగడంతో బిడ్‌ మొత్తాన్ని పెంచింది. ఇపుడు బిడ్‌ను రూ. 5700 కోట్లకు పెంచినా.. అదానీ రూ. 6000 కోట్లకు వేయడంతో... రుచి సోయా కొనేందుకు రామ్‌దేవ్‌ బాబా రూ. 6000 కోట్లకు మించి చెల్లించేందుకు సిద్ధపడాలి.  సన్‌రిచ్‌ బ్రాండ్‌తో వివిధరకాల నూనెలను తయారు చేసి అమ్మే రుచి సోయా కంపెనీని  దినేష్ సహ్రా ప్రమోట్‌ చేశారు. ఈ కంపెనీ బ్యాంకులకు రూ. 9000 కోట్ల దాకా రుణాలు చెల్లించడంలో విఫలైమంది