గోడ కూలి ముగ్గురు మృతి..మృతుల్లో 6 నెలల బాలుడు

గోడ కూలి ముగ్గురు మృతి..మృతుల్లో 6 నెలల బాలుడు

నిజామాబాద్‌లోని వర్ని మండలం తగిలేపల్లి గ్రామంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. మానిగిరి లక్ష్మి(28), శ్రీనివాస్‌(34) దంపతులు స్థానికంగా కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇంటి వరండాలో వారు పిల్లలతో పాటు పడుకున్నారు. వారికి పక్కనే ఉన్న పాత ప్రహరీ గోడ, ఉదయం 6గంటల ప్రాంతంలో ఒక్కసారిగా కుప్పకూలిందిగోడ ఆకస్మాత్తుగా కూలడంతో లక్ష్మి, సందీప్‌వర్ధన్‌ అక్కడికక్కడే మృతిచెందారు. శ్రీనివాస్‌ను ఆస్పత్రికి తీసుకెళ్తుండగా చనిపోయాడు. సంజన, అశ్విని, వైష్ణవి బోధన్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.రెక్కాడితే కానీ డొక్కాడని శ్రీనివాస్‌ దంపతులు డబుల్‌ బెడ్‌రూం పథకానికి అర్హులైనప్పటికీ..వారికి ఇల్లు దక్కలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.వారి మృతికి సర్పంచే కారణమని ఆరోపిస్తూ మృతదేహాలను తరలించకుండా గ్రామస్తులు అడ్డుకున్నారు.