వ‌రుణ్ టైటిల్‌ `వ్యోమ‌గామి`?

వ‌రుణ్ టైటిల్‌ `వ్యోమ‌గామి`?

సాహ‌సాలు.. ప్ర‌యోగాలు.. ఇదీ వ‌రుణ్‌తేజ్ స్టైల్‌. తొలి నుంచి అత‌డు వెళుతున్న దారి ఇత‌ర హీరోల‌తో పోలిస్తే వైవిధ్యంగానే ఉంది. మెగా ఫ్యామిలీలోనే వేరొక హీరో ఆ స్థాయిలో ప్ర‌యోగాలు చేయ‌లేదంటే అతిశ‌యోక్తి కాదు. క‌మ‌ర్షియాలిటీ కోసం ప్ర‌యోగాత్మ‌క క‌థ‌ల్ని వ‌దులుకోవ‌డం ఇష్టం లేని వ‌రుణ్ మ‌రోసారి అలాంటి ప్ర‌య‌త్న‌మే చేస్తున్నాడు. ఈసారి `ఘాజి` ఫేం సంక‌ల్ప్ రెడ్డితో క‌లిసి ఏకంగా అంత‌రిక్షం బ్యాక్‌డ్రాప్‌లో సినిమా చేస్తున్నాడు. అందుకోసం ఇదివ‌ర‌కే విదేశాల‌కు వెళ్లి అక్క‌డ వ్యోమ‌గామి శిక్ష‌ణ తీసుకున్నాడు. గుర‌త్వాకర్ష‌ణ (జీరో గ్రావిటీ) లేని చోట ఎలా జీవించాలి? అన్న‌దానిపై ప్ర‌త్యేకించి శిక్ష‌ణ తీసుకున్నాడు. 

ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో ఓ ప్ర‌యివేటు స్టూడియోస్‌లో నిర్మించిన స్పేస్ షిప్ సెట్‌లో కీల‌క స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ సాగుతోంది. వ‌రుణ్‌తేజ్ & న‌టీన‌టుల‌పై ఆస‌క్తిక‌ర స‌న్నివేశాల్ని తెర‌కెక్కిస్తున్నార‌ట‌. అయితే ఈ సినిమాకి టైటిల్ ఏం నిర్ణ‌యించేందుకు టీమ్ ఎంతో ఆలోచిస్తోందిట‌. ఇదివ‌ర‌కూ `అహం బ్ర‌ష్మ‌ష్మి` అనే టైటిల్ వినిపించినా అది ఫైన‌ల్ కాలేద‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం వ‌రుణ్‌-సంక‌ల్ప్ బృందం `వ్యోమ‌గామి` అనే టైటిల్‌ని ప‌రిశీలిస్తున్నార‌ని తెలుస్తోంది. క‌థాంశం ప్ర‌కారం ఈ టైటిల్ యాప్ట్ అని భావిస్తున్నార‌ట‌.