బాలయ్యతో సినిమా ఈ ఏడాదే

బాలయ్యతో సినిమా ఈ ఏడాదే

నందమూరి బాలకృష్ణ ఇవాళే తన 58వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. ఈ తరుణంలో ఆయన చేయబోయే సినిమాల వివరాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. గత కొద్ది రోజులుగా వివి వినాయక్ దర్శకత్వంలో బాలయ్య సినిమా ఉంటుందని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా వివి వినాయక్, బాలయ్య బాబుకు శుభాకాంక్షలు తెలుపుతూ నా ఏ ఏడాది బాలయ్యతో సినిమా చేయబోతున్నా, సి కళ్యాణ్ నిర్మాతగా వ్యవహరిస్తారని ట్విట్టర్ ద్వారా తెలిపారు. 

గతంలో బాలకృష్ణ, వివి వినాయక్ కాంబినేషన్ లో వచ్చిన చెన్నకేశవ రెడ్డి చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. చాలా గ్యాప్ తరువాత ఈ కాంబోలో సినిమా వస్తుండడంతో ఆరంభం నుండే మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి. ఇది పక్కా కమర్షియల్ జోనర్లో అందరిని ఆకట్టుకునేలా ఉండనుంది. మరోవైపు బాలయ్య, క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ లో నటించనున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.