ఆ కుటుంబంలో కల్లోలం రేపిన విషవాయువు...!

ఆ కుటుంబంలో కల్లోలం రేపిన విషవాయువు...!

అందమైన జీవితం... సంతోషానికి కొదవలేదు. అమ్మానాన్న, బంధువులు.. ఎప్పడూ ఇల్లంతా సందడి. కానీ.. ఒక్క రాత్రి ఆ కుటుంబంలో అంతులేని విషాదాన్ని నింపింది. 9 ఏళ్లకే నిండునూరేళ్లు నిండిపోయాయి.  విశాఖ గ్యాస్ లీక్ ఘటనలో  విషవాయువు . గ్రీష్మ అనే 9 ఏళ్ల బాలికను కబళించింది.  హాయిగా నిద్రపోతున్న వేళ... ఒక్కసారిగా

మృత్యువు కాటేసింది. గ్రీష్మ మరణం. ఆ కుటుంబానికి అంతులేని వేదన మిగిల్చింది. 

అభం శుభం తెలియని చిన్నారి ఏం జరుగుతుందో తెలియకుండానే.. చనిపోయింది. అర్థరాత్రి నిద్రలో ఉండగానే.. ప్రాణం పోయింది. బంధువులు ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే చిన్నారి మరణించింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తల్లికి కూతురి మరణం సంగతి చెప్పలేక.. దాచలేక బంధువులు నరకయాతన అనుభవిస్తున్నారు. విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనలో ఓ కుటుంబానికి ఎదురైన విషమ పరిస్థితి ఇది. 

తొమ్మిదేళ్ళ చిన్నారి గ్రీష్మ.. నాలుగో తరగతి చదువుతోంది. ఎల్.జీ.పాలీమర్ చిమ్మిన విషవాయువులు పీల్చి మ్ర్రత్యు ఒడిలోకి చేరింది. పట్టుమని పదేళ్ళు నిండకుండానే నూరేళ్ళ జీవితం ముగిసిపోయింది. గ్రీష్మ మ్ర్రతదేహానికి పోస్ట్ మార్టమ్ పూర్తైంది. ఐతే, డెడ్ బాడీని తీసు కెళ్ళడానికి అమ్మానాన్న లేరు. ఎందు కంటే వారూ ఆసుపత్రిలోనే వున్నారు. 

గ్యాస్ లీకైనప్పుడు చిన్నారి గ్రీష్మ కుటుంబం మేడపై నిద్రిస్తోంది. ఆమె పక్కింట్లో ఉండే బాబాయి కుటుంబం గ్యాస్ వాసన వస్తోందని అప్రమత్తమై.. సురక్షిత స్థలానికి వెళ్లిపోయారు. ఆ తర్వాత గ్రీష్మ తండ్రికి ఫోన్ చేశారు. అయితే ఫోన్ తీయకపోవడంతో.. వాళ్ల ఇంటికి వెళ్లి చూసేసరికి.. కుటుంబ సభ్యులంతా ఒకరిపై ఒకరు స్పృహ లేకుండా పడి ఉన్నారు. దీంతో అందర్నీ హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అప్పటికే గ్రీష్మ చనిపోయిందని డాక్టర్లు చెప్పారు. 

గ్రీష్మ తం డ్రి గణేష్. సింహాచలం ఆర్టీసీ డిపోలో డీజిల్ మెకానిక్. తల్లి లత గ్ర్రహిణి. వీరికి పార్ధు అనే కొడుకు వున్నాడు. మొత్తం కుటుంబం అంతా విషవాయువు బారిన పడింది. పార్ధు కోలుకోగా....గ్రీష్మ మాత్రం మృత్యువు ఒడికి చేరుకుంది. కుటుంబం అంతా ఎల్జీ పాలిమర్స్ దెబ్బకు కకావికలం అయిపోంది.