సెహ్వాగ్ కు అరుదైన గౌరవం...

సెహ్వాగ్ కు అరుదైన గౌరవం...

భారత మాజీ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ కు అరుదైన గౌరవం దక్కింది. 2020 జాతీయ క్రీడా అవార్డుల ఎంపిక కమిటీలో సభ్యుడిగా సెహ్వాగ్ ఎంపికయ్యాడు. ఈ కమిటీలో మన దేశంలో ప్రాముఖ్యం పొందిన ప్రతి క్రీడా రంగం నుండి ఒకరిని సభ్యునిగా తీసుకుంటారు. అయితే మన దేశంలో క్రీడలో అందించే రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, ద్రోణాచార్య అవార్డు, అర్జున అవార్డు, ధ్యాన్ చంద్ అవార్డు, రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురుషస్కర్ అవార్డు మరియు మౌలానా అబుల్ కలాం ఆజాద్ (మాకా) ట్రోఫీకి ఆటగాళ్లను, కోచ్ లను ఈ కమిటీ ఎంపిక చేస్తుంది. అయితే ఈ కమిటీని యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది. ఇక సుప్రీంకోర్టు రిటైర్డ్ జస్టిస్ ముకుండకం శర్మ ఈ కమిటీ చైర్‌పర్సన్‌గా ఉన్నారు. సభ్యులుగా వీరేందర్ సెహ్వాగ్ (క్రికెట్), సర్దార్ సింగ్ (హాకీ), ​​మొనాలిసా బారుహ్ మెహతా (టేబుల్ టెన్నిస్), దీపా మాలిక్ (పారా అథ్లెటిక్స్), వెంకటేశన్ దేవరాజన్ (బాక్సింగ్) తో పాటు భారత క్రీడా రంగానికి చెందిన మరికొంతమంది ప్రముఖ పేర్లు ఉన్నాయి.