ఆయన మాట వినండి : కోహ్లీ

ఆయన మాట వినండి : కోహ్లీ

కోవిద్ 19 మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో అందరూ ఇంటికే పరిమితమయ్యారు. జనతా కర్ప్యూలో విజయవంతంగా పాల్గోని, తరువాత ఎలాంటి సామాజిక స్పృహ లేకుండా రోడ్లపై తిరుగుతున్న ప్రజలను కట్టడిచేయడానికి ప్రధాని మోది 21 రోజులు దేశమంతా లాక్‌డౌన్‌ ప్రకటించారు .దేశమంతా ప్రధాని లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో కోహ్లీ ఈ ట్వీట్‌ చేశాడు. మంగళవారం అర్ధరాత్రి నుంచి 21 రోజుల పాటు దేశమంతా లాక్‌డౌన్‌ లోకి వెళుతుందని గౌరవనీయులైన ప్రధాని నరేంద్రమోది ప్రకటించారు. నా అభ్యర్ధన కూడా అదే. దయచేసి అందరూ ఇంట్లోనే ఉండండి అని విరాట్‌ ట్వీట్‌ చేశాడు. మరి కోహ్లీ మాటను అభిమానులు ,ప్రజలు వింటారేమో చూడాలి.