రాహుల్ నీది మురికిగా ఉంది...

రాహుల్ నీది మురికిగా ఉంది...

ఇండియా బాట్స్మెన్ కెఎల్ రాహుల్ తను కాఫీ తాగే ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ దానిపై తనకున్న ప్రేమను ప్రకటించాడు, కానీ అభిమానులకు మాత్రం ఈ ఫోటోను చూసినప్పుడు వారి మనసులోకి ఇంకేదో వచ్చింది. అదే 2019 జనవరిలో చిత్రనిర్మాత కరణ్ జోహార్ యొక్క టాక్ షో 'కాఫీ విత్ కరణ్' లో జరిగిన సంఘటనను అభిమానులు గుర్తుచేసుకున్నారు. ''ఈ కాఫీ కంటే ఆ కాఫీ చాల విలువైనది, మళ్ళీ కరణ్ ను పిలువమంటారా'' అంటూ సెటైర్లు వేశారు. ఇక కేఎల్ రాహుల్ ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా అదే ఫోటో అప్‌లోడ్ చేసాడు, అక్కడ భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అతనిని ట్రోల్ చేసాడు.  "కప్ మురికిగా ఉంది" అని కోహ్లీ రాహుల్ ఫొటోకు కామెంట్  జత చేసాడు. ఏదేమైనా, కెఎల్ రాహుల్ ఇటీవల మాట్లాడుతూ... ఆ సమయంలో అతని సస్పెన్షన్ తనకు స్థిరమైన ప్రదర్శనలను ఇవ్వడంలో మరియు జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకోవడంలో ప్రధాన పాత్ర పోషించింది అని తెలిపాడు.