మా ప్రయాణంలో ముఖ్యమైన మైలురాయి....

మా ప్రయాణంలో ముఖ్యమైన మైలురాయి....

విరాట్ కోహ్లీ 2014 లో భారత టెస్ట్ జట్టు కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించాడు. ఆ తర్వాత జట్టును ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానానికి నడిపించాడు. 2014 లో అడిలైడ్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ ఓటమి తనకు, తన జట్టుకు నేర్పించిన విషయాన్ని భారత కెప్టెన్ ట్విట్టర్‌లో వివరించాడు. అడిలైడ్ 2014 అనేది రెండు వైపులా భావోద్వేగాలతో నిండిన ఆట అంటూ కొన్ని ఫోటోలను అభిమానులతో పంచుకున్నాడు. ఇక "మన మనస్సును దానిపై ఉంచితే ఏదైనా సాధ్యమే, ఎందుకంటే అప్పుడే మనం ప్రారంభించడానికి అడ్డుగా ఉన్నది తీసేయగలము. మనమందరం దీనికే కట్టుబడి ఉన్నాము. ఇది ఎల్లప్పుడూ మనకు చాలా ముఖ్యమైన మైలురాయిగా ఉంటుంది'' అని కోహ్లీ తెలిపాడు. అడిలైడ్‌లో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ యొక్క మొదటి టెస్ట్, భారత్ 2014 డిసెంబర్ 9 నుండి 13 వరకు ఆడింది, రెండవ ఇన్నింగ్స్‌లో కోహ్లీ 141 పరుగులు చేసినప్పటికి భారత్ 48 పరుగుల తేడాతో ఓడిపోయింది.