ఫోర్బ్స్‌ జాబితాలో కోహ్లీ

ఫోర్బ్స్‌ జాబితాలో కోహ్లీ

భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో ఘనతను సొంతం చేసుకున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక పారితోషికం అందుకుంటున్న టాప్-100 ఆటగాళ్ల జాబితాలో స్థానం సంపాదించాడు. ఏడాదికి 24 మిలియన్ డాలర్ల సంపాదనతో విరాట్ 83వ ర్యాంక్‌లో నిలిచాడు. ఇందులో 4 మిలియన్‌ డాలర్లను జీతంగా అందుకున్న కోహ్లీ.. మిగతా 20 మిలియన్‌ డాలర్లను యాడ్స్‌ ద్వారా సంపాదించాడు. గత ఏడాది జూన్‌ 1 నుంచి ఈ ఏడాది జూన్‌ 1 మధ్య ఆటగాళ్లు పొందిన ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకొని ఫోర్బ్స్‌ ఈ జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో అమెరికా బాక్సింగ్‌ దిగ్గజం ఫ్లాయడ్‌ మేవెదర్‌(285 మిలియన్‌ డాలర్లు) అగ్రస్థానంలో నిలిచాడు. అర్జెంటీనా ఫుట్‌బాల్‌ ఆటగాడు మెస్సీ(111 మిలియన్‌ డాలర్లు), పోర్చుగల్‌ ఫుట్‌బాల్‌ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో(108 మిలియన్‌ డాలర్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. గత ఏడాది 22 మిలియన్‌ డాలర్ల ఆదాయంతో 89వ స్థానంలో నిలిచిన కోహ్లీ ఈ ఏడాది తన స్థానాన్ని కాస్త మెరుగుపరుచుకున్నాడు.  ఈ ఏడాది టాప్‌-100 జాబితాలో ఒక్క మహిళ కూడా లేకపోవడం గమనార్హం.