కోహ్లీ దారెటు?

కోహ్లీ దారెటు?

వచ్చే జూన్ నెలలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి విచిత్ర అనుభవం ఎదురుకానుందా అంటే అవుననే అంటున్నారు క్రికెట్ పండితులు.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 11వ సీజన్ తర్వాత విరాట్ కోహ్లీ కౌంటీ క్రికెట్ ఆడేందుకు ఇంగ్లాండ్ వెళ్లనున్నాడు.. జూన్ నెల మొత్తం సర్రే తరపున ప్రాతినిథ్యం వహించనున్నాడు.. అయితే ఇదే టైంలో ఐర్లాండ్‌ తో టీమిండియా తలపడనుంది. తాను కౌంటీల్లో ఆడుతుండటం వల్ల ఐర్లాండ్‌తో జరిగే రెండు అంతర్జాతీయ టీ-20 మ్యాచ్‌లకు దూరమవుతానని కోహ్లీ ప్రకటించాడు.. అతని స్థానంలో రహనే కెప్టెన్ అవుతాడని.. అయ్యర్‌ను జట్టులోకి తీసుకుంటారని ప్రచారం జరిగింది.. కానీ బీసీసీఐ ఐర్లాండ్ పర్యటన కోసం ప్రకటించిన భారత జట్టుకు సారథిగా విరాట్ కోహ్లీయే వ్యవహరిస్తాడని వెల్లడించింది. ఆ దేశ రాజధాని డబ్లిన్‌లో జూన్ 27, 29 తేదీల్లో రెండు టీ-20 మ్యాచ్‌లను ఆడనుంది. అదే సమయంలో జూన్ 25 నుంచి 28 వరకు యార్క్‌షైర్‌తో తలపడే సర్రే జట్టులో కోహ్లీ అందుబాటులో ఉంటాడని ఆ జట్టు యాజమాన్యం తెలిపింది. మరి ఈ క్లిష్ట పరిస్థితిని కోహ్లీ ఎలా ఎదుర్కొంటాడు.. ఎవరికీ నో చెబుతాడు అంటూ సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చకు దారి తీసింది.