ఫ్యాన్స్‌కి విరాట్ వీడియో సందేశం...

ఫ్యాన్స్‌కి విరాట్ వీడియో సందేశం...

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ఫ్యాన్స్‌కి ట్విట్టర్ వేదికగా ఓ వీడియో సందేశాన్ని పంపారు... ఐపీఎల్ అనంతరం కౌంటీ క్రికెట్ కోసం ఇంగ్లండ్ వెళ్లాల్సిన విరాట్... గాయం కారణంగా ఇక్కడే ఉండిపోయాడు. దాంతో పాటు ఆఫ్ఘన్‌తో జరిగే టెస్ట్ మ్యాచ్‌, ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు కూడా కోహ్లీ దూరమయ్యే అవకాశం ఉందంటున్నారు. అయితే తన ఫిట్‌నెస్, గాయం గురించి ఓ వీడియో తీసి ట్వీట్ చేసిన విరాట్... ‘‘అందరికి హాయ్, చాలా కష్టపడుతున్నాను... రీహాబిటేషన్ కూడా అవుతోంది. నేను ఏం చేయాలో... ఏది సాధ్యమడుతుందో అన్ని వర్క్ ఔట్లు చేస్తున్నాను. ఇక మీ అందరికి ఒకటే చెబుతున్నాను. కష్టపడి పని చేయండి. అలా చేస్తూనే ఉండండి. కష్టపడి పని చేస్తే.. తప్పకుండా ఫలితం ఉంటుంది. చీర్స్’’ అంటూ ఉన్న వీడియోను షేర్ చేశాడు.