సమంత గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే నాగచైతన్య సినిమా పట్టాలెక్కుతోంది ...

సమంత గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే నాగచైతన్య సినిమా పట్టాలెక్కుతోంది  ...

వరుస సినిమాలతో బిజీగా ఉన్న అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య తాజాగా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు . తనతో `మనం` వంటి బ్లాక్‌బస్టర్ రూపొందించిన దర్శకుడు విక్రమ్ కుమార్‌తో నాగచైతన్య మరో సినిమా చేయబోతున్నాడు . ప్రస్తుతం శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న `లవ్‌స్టోరీ`లో నటిస్తున్న చైతన్య ఆ తర్వాత ఈ సినిమాను ప్రారంభించాలనుకున్నాడట. ఇప్పటికే నాగచైతన్యకు కథ కూడా వినిపించాడట.  ఈ సినిమాకు `థాంక్యూ` అనే టైటిల్‌ను ఫిక్స్ చేసారు . ఇదిలా ఉంటే దర్శకుడు విక్రమ్ కొత్త ట్విస్ట్ ఇచ్చాడట . అదేంటంటే ... డైరెక్టర్  పరశురామ్ ప్రస్తుతం మహేశ్ బాబుతో కలిసి సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. మహేష్ కంటే ముందు నాగచైతన్యకి ఓ స్క్రిప్ట్ వినిపించాడు పరశురామ్. అదే సమయంలో  మహేష్ ఓకే చేయడంతో చైతుతో మూవీ ఆగిపోయింది. ప్రస్తుతం ఆగిపోయిన స్క్రిప్ట్ సెట్స్ పైకి  తీసుకెళ్లాలని కోరాడట  చైతూ.. అదే టైం లో  విక్రమ్ కుమార్ ఓ కండీషన్ పెట్టాడట .. ఆ సినిమా చేయాలంటే సమంతను హీరోయిన్ గా పెట్టాలని సూచించాడట. అందుకు నాగచైతన్య కూడా ఒకే చెప్పినట్లు తెలుస్తుంది.