డియర్ కామ్రేడ్ @కాకినాడ 

డియర్ కామ్రేడ్ @కాకినాడ 

తెలుగు యువ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. తాజాగానే మహానటి సినిమాలో విజయ్ ఆంటోని పాత్రలో మెరిశాడు. మొన్న ఈ హీరో పుట్టిన రోజు కానుకగా డియర్ కామ్రేడ్ గా తెరకెక్కనున్న సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ రెండో వారం నుండి మొదలు కానుంది. ఈ సినిమాలో విజయ్ విద్యార్ధి నాయకుడిగా దర్శనమివ్వనున్నారు. విప్లవభావాలున్న పాత్రలో..కాకినాడ ప్రాంతానికి చెందిన వాడిగా కనిపిస్తారు. 

ఇందుకోసం కోస్త యాసలో మాట్లాడటానికి తగు శిక్షణ తీసుకుంటున్నాడట. ఈ సినిమాను లడఖ్, ఊటీ లలో షూటింగ్ జరపనున్నారు. కేవలం నాలుగు నెలలో మొత్తం పూర్తి చేసి దసరా నాటికి రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేశారు. విజయ్ సరసన రష్మిక మందన నటించనుంది. ఈమె క్రికెటర్ గా కనిపిస్తుండడంతో అందుకు తగిన యాక్టింగ్ ట్రైనింగ్ ను ఈ ముద్దు తీసుకుంటోంది. నూతన దర్శకుడు భరత్ కమ్మ దర్శకత్వంలో రానున్న ఈ చిత్రానికి జస్ట్ ఇన్ ప్రభాకరన్ సంగీతం సమకూర్చనున్నారు. సక్సెస్ ఫుల్ బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్..బిగ్ బెన్ సినిమాస్ తో కలిసి నిర్మిస్తోంది.