ఫైటర్ లో విజయ్ లుక్ ఎలా ఉండబోతుందంటే...  

ఫైటర్ లో విజయ్ లుక్ ఎలా ఉండబోతుందంటే...  

విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా చేస్తున్నారు.  ఈ సినిమా షూటింగ్ పూర్తయింది.  ఫిబ్రవరి 14 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  ఈ మూవీ టీజర్ ఇటీవలే రిలీజ్ చేశారు.  ఈ టీజర్ అదిరిపోయింది.  టీజర్ చూస్తుంటే... అచ్చంగా అర్జున్ రెడ్డిని చూస్తున్నట్టుగా ఉన్నది.  అందులో ఒక్కరే హీరోయిన్ అయితే, ఇందులో నలుగురు హీరోయిన్లు ఉన్నారు.  

అయితే, విజయ్ ... పూరి కాంబినేషన్లో సినిమా స్టార్ట్ కాబోతున్నది.  సంక్రాంతి తరువాత ఈ సినిమా స్టార్ట్ కాబోతున్నది.  ఇందులో విజయ్ దేవరకొండను కొత్తగా చూపించబోతున్నారు. బాలీవుడ్ స్టార్ స్టైలిస్ట్ అలీం హకీమ్ ఈ సినిమాకు స్టైలిస్ట్ గా పనిచేయబోతున్నారు.  ఈయన నేతృత్వంలో విజయ్ దేవరకొండను కొత్తగా చూపిస్తున్నారట.  విజయ్ లుక్ అదిరిపోతుందని అంటున్నారు.  మరి ఆ లుక్ ఎలా ఉంటుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.