కాశి రుచి చూపి.. సస్పెన్స్ లో పెట్టాడు..!

కాశి రుచి చూపి.. సస్పెన్స్ లో పెట్టాడు..!
విజయ్ ఆంటోని చేసింది కొన్ని సినిమాలే అయినా తెలుగు ప్రజలకు సుపరిచితమయ్యాడు.  బిచ్చగాడు సినిమాతో మంచి పాపులారిటీ తెచ్చుకున్న ఈ తమిళ నటుడు భేతాళుడుతో మార్కెట్ పెంచుకున్నాడు.  ఇక భేతాళుడులోని కొన్ని సన్నివేశాలను సినిమా విడుదలకు ముందే రిలీజ్ చేసి ఆసక్తి రేపిన ఈ నటుడు.. కాశీ విషయంలో కూడా అదే స్ట్రాటజీని ఫాలో అయ్యాడు.  సినిమాకు సంబంధించిన మొదటి 7 నిమిషాలు సోషల్ మీడియాలో విడుదల చేశాడు.  
 
ఒక పల్లెటూరిలో చిన్న పిల్లవాడితో సినిమా ప్రారంభం అవుతుంది.  ఎద్దును పాము కాటెయ్యబోవడం.. ఎద్దు తాడు తెంచుకొని పరుగులు తీయడంతో కథ మొదలౌతుంది.  ఆ వెంటనే కథ అమెరికాకు వెళ్తుంది. ఆంటోని వైద్యుడిగా అమెరికాలో స్థిరపడతారు.  తల్లి దండ్రులతో చిన్నప్పుడే అమెరికాకు వచ్చి అక్కడే చదువుకొని డాక్టర్ అవుతారు.  జీవితంలో అన్ని ఉన్నాయి.  అన్ని ఉన్నా ఎదో లేని వెలితి.. ప్రతి రోజు నిద్రలో  పాము, ఎద్దు.. పిల్లవాడి ఏడుపు కలలోకి వస్తుంటాయి.  అలా ఎందుకు వస్తాయో తెలియదు.  ఈ విషయం తల్లి దండ్రులకు చెప్తాడు.  అయితే, ఓ సందర్భంలో తల్లిదండ్రుల ద్వారా ఓ నిజం తెలుసుకొని.. ఇండియా వెళ్లి వారం రోజుల్లో తన గతం గురించి తెలుసుకోవాలని ఇండియాకు బయలుదేరుతాడు.  ఇండియా వచ్చిన తరువాత ఏం జరిగింది అన్నది మితంగా కథ.. 
 
విజయ్ ఆంటోని సినిమా మొదట స్లో గామొదలౌతుంది.  కానీ, ట్విస్ట్స్, కథనాలు అద్భుతంగా ఉంటాయి. సోషల్ మీడియాలో రిలీజ్ చేసిన ఏడు నిమిషాల కథే చాలా ఆసక్తిగా సస్పెన్స్ గా ఉన్నది.  మిగతా కథ ఎలా ఉంటుంది అనే ఆసక్తిని రేకెత్తించింది.  ట్రైలర్లు, ప్రోమోల కంటే.. ఇలా కొన్ని నిముషాల సినిమాను ముందుగా రిలీజ్ చేసి ఆ తరువాత ఎం జరిగిందో సినిమాలో చూడమంటే తప్పకుండా ప్రేక్షకులు థియేటర్స్ కు వస్తారు.