మరో బయోపిక్ లో విద్యా బాలన్ 

మరో బయోపిక్ లో విద్యా బాలన్ 

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యా బాలన్ త్వరలోనే తెలుగు తెరపై సందడి చేయనున్న సంగతి తెలిసిందే. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జీవిత చరిత్ర ఆధారంగా ఎన్టీఆర్ బయోపిక్ లో ఈమె నటించనుంది. బాలకృష్ణ టైటిల్ రోల్లో నటించనుండగా, ఈమె ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో మెరవనున్నారు. త్వరలోనే క్రిష్ దర్శకత్వంలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. 

మరోవైపు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ బయోపిక్ నిర్మాతల్లో ఒకరైన విష్ణు ఇందూరి, తమిళ మాజీ సీఎం స్వర్గస్థులు జయలలిత మీద బయో పిక్ తీసే యోచనలో ఉన్నారట. గత కొద్ది రోజులుగా ఈ వార్త చక్కర్లు కొడుతున్నప్పటికీ ఏది అధికారంగా బయటికి రాలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఈ బయోపిక్ ను లార్జ్ స్కెల్ లో నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారట. ఇదివరకే ఈ విషయంపై విద్యా బాలన్ తో చర్చలు కూడా జరిపారట. ఈ ప్రాజెక్టు కోసం టాప్ టెక్నీషియన్స్ ను రంగంలోకి దింపాలని చూస్తున్నారు. మరి అన్ని కుదిరితే జయలలిత బయోపిక్ సెట్స్ మీదకు వెళ్తుందేమో చూడాలి.